- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కచ్చితంగా పదేళ్లలో సీఎం అవుతా : త్రిష వీడియో వైరల్, బండ్ల గణేష్ విషెస్
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయంపై బండ్లగణేష్ త్రిషకు విషెస్ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతోంది. తొలి అడుగులోనే వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చారిత్రాత్మక విజయం ఖాయమైన వేళ, టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
త్రిషను ట్యాగ్ చేస్తూ ఆసక్తికర పోస్ట్
విజయ్ పార్టీ లీడింగ్‌లో ఉన్న తరుణంలో బండ్ల గణేశ్ నటి త్రిషను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలిపారు. "ఆ తిరుమల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నీ కల నెరవేరబోతోంది.. కంగ్రాట్స్ త్రిష" అంటూ ఆయన ట్వీట్ చేశారు. విజయ్ రాజకీయాల్లో రాణించాలని, ఆయన ముఖ్యమంత్రి కావాలని త్రిష గతంలో పలుమార్లు తన ఆకాంక్షను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కలను ప్రస్తావిస్తూ బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాకతాళీయం.. త్రిష బర్త్ డే నాడే విజయ్ విక్టరీ!
మరో విశేషం ఏంటంటే.. నేడు త్రిష పుట్టినరోజు కావడం. సరిగ్గా తన పుట్టినరోజు నాడే ఎన్నికల ఫలితాలు రావడం, అందులోనూ ఆమె అత్యంత సన్నిహితుడు విజయ్ పార్టీ దూసుకుపోతుండటం విశేషం. ఈ క్రమంలోనే ఆమె ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ విజయాన్ని కాంక్షిస్తూనే ఆమె స్వామివారిని వేడుకున్నారని, ఆ మొక్కులు ఇప్పుడు ఫలించాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.
కీలక పాత్ర పోషించనున్నా
రా?
దాదాపు 15 ఏళ్ల క్రితం తనకు కూడా సీఎం కావాలనే కోరిక ఉందని త్రిష చెప్పిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోను బండ్లగణేష్ తన పోస్టులో ట్యాగ్ చేశారు. విజయ్ పార్టీ అధికారం చేపడితే.. భవిష్యత్తులో త్రిష ఆ పార్టీలో గానీ లేదా ప్రభుత్వంలో గానీ ఏదైనా కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాట విజయ్ గెలుపు ఒక ఎత్తయితే, ఆ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్న త్రిషకు బండ్ల గణేశ్ ట్వీట్ తో విషెస్ చెప్పడం మరో ఎత్తుగా నిలిచింది.






