నా ఉద్దేశం అది కాదు.. బండ్ల గణేష్

by Sujitha Rachapalli |

కిరణ్ అబ్బవరం ‘కె రాంప్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీపావళి విన్నర్‌గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో సినిమా సక్సెస్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేయగా.. గెస్ట్‌గా హాజరయ్యాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..

నా ఉద్దేశం అది కాదు.. బండ్ల గణేష్
X

దిశ, వెబ్ డెస్క్ : కిరణ్ అబ్బవరం ‘కె రాంప్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీపావళి విన్నర్‌గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో సినిమా సక్సెస్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేయగా.. గెస్ట్‌గా హాజరయ్యాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఒక్క సినిమా సక్సెస్ కాగానే ఓ హీరో రెచ్చిపోయిండని.. లూజు ప్యాంట్లు.. చీకట్లో గ్లాసులు.. గొప్ప డైరెక్టర్లను తీసుకురావాలని.. వాట్సాప్ వాట్సాప్.. అంటున్నాడని కామెంట్స్ చేశాడు. దీంతో తమ హీరోనే టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో ఈ స్పీచ్ వైరల్ కావడంతో దీనిపై క్లారిటీ ఇచ్చాడు బండ్ల. ‘ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే’ అని క్లారిటీ ఇచ్చాడు.

Next Story