- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వస్తున్నా.. ఇప్పుడే అసలు సినిమా మొదలవ్వుద్ది.. బండ్ల గణేష్ కీలక ప్రకటన
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన రీఎంట్రీని ప్రకటించాడు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసుకదా సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాత ఎస్కేఎన్ తనను రీఎంట్రీ ఇవ్వాలని అడిగాడని చెప్పారు. తాను టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సినిమాలకు బ్రేక్ ఇచ్చానని

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన రీఎంట్రీని ప్రకటించాడు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసుకదా సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాత ఎస్కేఎన్ తనను రీఎంట్రీ ఇవ్వాలని అడిగాడని చెప్పారు. తాను టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సినిమాలకు బ్రేక్ ఇచ్చానని, ఫ్లాప్ సినిమాతో బ్రేక్ తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమా మొదలవుతుందని స్పష్టం చేశారు. దీంతో నిర్మాతగా తన రీఎంట్రీని కన్ఫామ్ చేశారు.
ఇదిలా ఉంటే బండ్ల గణేష్ మొదట నటుడిగా సినిమాల్లో మెప్పించగా తరవాత రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు సినిమాతో టాలీవుడ్‌కు ప్రొడ్యూసర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తరవాత వరుస సినిమాలు చేసినా గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. గబ్బర్ సింగ్ తరవాతే బండ్లకు నిర్మాతగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక చివరగా ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తరవాత ఏం జరిగిందో కానీ సినిమాకు దూరం అయ్యారు. ఇప్పుడు రీఎంట్రీ ప్రకటించడంతో ఏ హీరోతో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.






