- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేజీపైనే తాటతీశాడు.. బండ్ల గణేష్ టార్గెట్ ఆ హీరోనే..
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కె - ర్యాంప్’ దీపావళి విన్నర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది టీమ్. ఇందుకు గెస్ట్‌గా హాజరైన బండ్ల గణేష్.. హీరో కిరణ్

దిశ, వెబ్ డెస్క్ : కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కె - ర్యాంప్’ దీపావళి విన్నర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది టీమ్. ఇందుకు గెస్ట్‌గా హాజరైన బండ్ల గణేష్.. హీరో కిరణ్ అబ్బవరంపై పొగడ్తలు కురిపిస్తూనే మరో హీరోపై సెటైర్లు వేశాడు. ఒక్క సినిమా హిట్ అయితే ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా.. సుకుమార్‌ను తీసుకురా.. అనిల్ రావిపూడిని తీసుకురా.. అనే ఈ రోజుల్లో.. కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాకి కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేశాడని చెప్పాడు. ఒక్క హిట్ కొడితే.. లూజు ప్యాంట్లు.. కొత్త చెప్పులు.. క్యాప్.. అటిట్యూడ్ వచ్చేస్తున్నాయని.. అలా చేయకుండా వాస్తవికంగా ఉండాలని సూచించాడు. కిరణ్ అబ్బవరంను చూస్తే చిరంజీవి గుర్తొస్తున్నాడని.. కచ్చితంగా భవిష్యత్తులో బాగా ఎదుగుతాడని బ్లెస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బండ్ల గణేష్ టార్గెట్ చేసింది ఆ హీరోనే అంటూ కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నారు.
READ MORE ....
బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలంటే దమ్ము కావాలంటూ.. ఆ హీరోకు ఇచ్చిపడేసిన బండ్ల గణేష్






