- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగంలోకి రకుల్ ప్రీత్.. బ్యాండ్ మేళం అప్డేట్ ఇచ్చిన మేకర్స్
by Chukka Sudharani |
‘కోర్ట్’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన క్రేజీ జంట హర్ష రోషన్, శ్రీదేవి.. ‘బ్యాండ్ మేళం’తో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.

X
దిశ, సినిమా: ‘కోర్ట్’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన క్రేజీ జంట హర్ష రోషన్, శ్రీదేవి.. ‘బ్యాండ్ మేళం’తో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌ను రంగంలోకి దించారు మేకర్స్. ఈ సినిమా నుంచి ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చిప్’ లిరికల్ సాంగ్‌ను మార్చి 20 సాయంత్రం 6:06 గంటలకు విడుదల రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయగా.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Next Story






