డ్యాన్స్ ఇరగదీసిన బాలయ్య చిన్న కూతురు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-30 06:56:48  IST  )

తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్‌తో కలిసి అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేశారు.

డ్యాన్స్ ఇరగదీసిన బాలయ్య చిన్న కూతురు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకప్పుడు మీడియా, సోషల్ మీడియాలో దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు తన టాలెంట్స్ ఒక్కొక్కటిగా బయటపెడుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని బాలకృష్ట హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో కూడా కీలకంగా పనిచేశారు. షో విజయవంతం కావడంలో ఆమె పాత్ర చాలా ఉందని తెలుస్తోంది. ఇక కేవలం బ్యాక్ స్టేజ్ వర్క్ మాత్రమే కాకుండా, తేజస్విని ఇటీవల ఓ ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ యాడ్‌‌లో కూడా నేరుగా కనిపించి తన గ్రేస్‌తో అందరినీ మెప్పించారు.

ఇదిలా ఉండగా, తాజాగా తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్‌తో కలిసి అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేశారు. అందులో ఆమె చూపించిన ఎనర్జీ, టైమింగ్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తేజస్వినిలో ఇంత మంచి డ్యాన్స్ టాలెంట్ కూడా ఉందా అని చాలా మంది షాక్ అవుతున్నారు. "ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టారు?" అని కొందరు అభిమానులు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘‘ సినిమాల్లోకి వస్తే హీరోయిన్‌గా తప్పకుండా సక్సెస్ అవడం ఖాయం. నందమూరి కుటుంబం నుండి మరో క్రేజీ స్టార్ సిద్ధమవుతోంది" అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే క్రియేటివిటీ, నటనతో మంచి పేరు తెచ్చుకున్న తేజస్విని.. ఇప్పుడు తన డ్యాన్స్‌తో కూడా సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story