- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తా.... నందమూరి బాలయ్య సంచలన ప్రకటన!
నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. నేను సంవత్సరానికి 4 సినిమాలు చేస్తానని బాలయ్య ప్రకటించారట. ఈ విషయాన్ని

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. నేను సంవత్సరానికి 4 సినిమాలు చేస్తానని బాలయ్య ప్రకటించారట. ఈ విషయాన్ని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ప్రసాద్ ల్యాబ్ లో అఖండ 2 మూవీ డబ్బింగ్ లో నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితులను బాలకృష్ణకు వివరించారు నిర్మాతలు మైత్రీ రవి, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత గోపినాథ్ ఆచంట, దామోదర ప్రసాద్.
ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను బాలయ్యకు వివరించారు నిర్మాతలు. ఈ సందర్బంగా నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడారు. ప్రతి హీరో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చెయ్యాలి అని బాలకృష్ణ చెప్పారని పేర్కొన్నారు. నేను సంవత్సరానికి 4 సినిమాలు చేస్తాను అని బాలయ్య వివరించినట్లు వెల్లడించారు. నిర్మాణ వ్యయం పెరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని బాలకృష్ణ చెప్పారన్నారు.






