- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరో వల్ల చిక్కుల్లో బాలయ్య–వివేక్ ఆత్రేయ మూవీ?
బాలయ్య-వివేక్ ఆత్రేయ కాంబో మూవీలో కీలక పాత్ర కోసం మోహన్‌లాల్‌ను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్‌ను కూడా మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో వివేక్ ఆత్రేయ చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతా సజావుగా జరుగుతున్న సమయంలో ఈ సినిమాకు ఒక చిన్న చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక అత్యంత కీలకమైన పాత్ర ఉన్నట్లు, అందులో మలయాళ నటుడు మోహన్‌లాల్‌ను తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈయనను సంప్రదించగా, ఈ చిత్రంలో నటించడానికి ఆయన ఆసక్తిగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఈ చిత్రానికి తేదీలు అడ్జస్ట్ చేయడం ఇబ్బందిగా మారుతుందట. దాంతో ప్రస్తుతం మోహన్‌లాల్‌తో మూవీ బృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు మోహన్‌లాల్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.






