- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య షాకింగ్ నిర్ణయం..మరోసారి ఆ అవతారం ?
బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబోలో NBK111 మూవీ రానుంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య తాజాగా నటించిన అఖండ 2 సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. డిసెంబర్ 12వ తేదీన విడుదలైన అఖండ 2 సినిమా, దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అఖండ 2 సినిమా ప్రభంజనం సృష్టించిన తరుణంలో, బాలయ్య నెక్ట్స్ చేస్తున్న ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబోలో NBK111 మూవీ రానుంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నారట. ఇప్పటికే వీరి కాంబోలో వీర సింహారెడ్డి వచ్చి సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నారు. అయితే, ఈ NBK111 మూవీలో బాలయ్య సాంగ్ పాడనున్నారట. 2017 లో వచ్చిన పైసా వసూల్ మూవీలో గానం అందుకున్నారు బాలయ్య. ఇక ఇప్పుడు గోపిచంద్ మలినేని కాంబోలో వస్తోన్న సినిమాలో కూడా స్వరం అందించనున్నారట. ఈ మేరకు గోపిచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారని టాక్. కాగా ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది.






