- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొరటాల చిత్రంలో అలాంటి పాత్రలో బాలయ్య.
కొరటాల శివ సినిమాలో బాలయ్య మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొన్ని రకాల అంచనాలు వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం బాలకృష్ణ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని, కథలో సెకండ్ హాఫ్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందని చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే, సెకండ్ హాఫ్‌లో భారీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతుందని, అందులో బాలకృష్ణ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ భాగంలో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉండనున్నాయని, వాటి కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని కూడా టాక్ ఉంది. అయితే ఈ సినిమా కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన బలమైన కథనాన్ని కూడా కలిగి ఉండబోతుందని సమాచారం. యాక్షన్–ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కథ ముందుకు సాగుతుందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మే నెలలో వచ్చే అవకాశం ఉండటంతో, బాలకృష్ణను మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో చూడబోతున్నామన్న వార్తే అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.






