పవన్ కళ్యాణ్, చిరంజీవి పేర్లు చెప్తూ నాకు గుడి కట్టాలంటున్న బాలయ్య బ్యూటీ.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

పవన్ కళ్యాణ్, చిరంజీవి పేర్లు చెప్తూ నాకు గుడి కట్టాలంటున్న బాలయ్య బ్యూటీ.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. హిందీలో ఎన్ని సినిమాల్లో నటించిన ఈ భామ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. అయితే తెలుగులో మాత్రం ఐటమ్ సాంగ్స్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ఊర్వశి బాలయ్య ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj)మూవీలో ఆయన సరసన చిందులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ‘జాట్’(jaat) లోనూ ఈ భామ తన డ్యాన్స్‌తో మెప్పించింది. అయితే ఊర్వశి ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టి్వ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి సంచలన కామెంట్స్ చేసింది.

‘‘నార్త్ ఇండియాలో బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఊర్వశి టెంపుల్ అని నాకు ఒక గుడి కట్టారు. అక్కడికి ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని చూసి రండి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనూ నా ఫొటోకు పూలమాలలు వేసి నన్ను దండమమాయి అని కూడా పిలుస్తారు. నేను ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. ఇది నిజం దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయి. మీరంతా వాటిని చదవచ్చు. అలాగే టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna) వంటి నటించాను. అక్కడ కూడా నాకు చాలామంది అభిమానులు ఉన్నారు. కాబట్టి వారు నాకు ఇక్కడ గుడి కట్టాలని కోరుతున్నాను. దేవత అయిపోతా అందరికీ ఆశీర్వాదం ఇస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

Next Story