బాలకృష్ణ చెంతకు సినీ కార్మికుల సమ్మె వ్యవహారం

by Muthe.Rajitha |

30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు 3 రోజుల నుంచి సమ్మె(Strike)కు దిగిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ చెంతకు సినీ కార్మికుల సమ్మె వ్యవహారం
X

దిశ, వెబ్ డెస్క్ : 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు 3 రోజుల నుంచి సమ్మె(Strike)కు దిగిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు ఈ పంచాయితీ సీనియర్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చెంతకు చేరింది. ఈ సమస్య పరిష్కారానికి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతల బృందం బాలకృష్ణను కలిసి తెలుగు సినిమా పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాలు, సంక్షేమం, ఇతర సమస్యలపై చర్చించింది. ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ... పరిశ్రమలో నిర్మాతలు ఆర్థికంగా బలంగా ఉంటేనే కార్మికులతో సహా అందరి సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.

షూటింగ్‌లలో అవసరమైనంత మంది సిబ్బందిని మాత్రమే తీసుకోవాలని, సమర్థవంతమైన టీమ్ నిర్వహణతో ఖర్చులను తగ్గించాలని సూచించారు. అలాగే, తాను సంవత్సరానికి నాలుగు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, సినీ కార్మికుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

Next Story