విశ్వరూపం చూపించాడు..! బాలకృష్ణ ‘అఖండ-2’ ట్రైలర్‌ వచ్చేసింది

by Ramesh Naini |   (  Updated:2025-12-23 15:56:44  IST  )

లెజెండ్ బాలయ్య- మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2’ సినిమా ట్రైలర్‌ వచ్చేసిందే.

విశ్వరూపం చూపించాడు..! బాలకృష్ణ ‘అఖండ-2’ ట్రైలర్‌ వచ్చేసింది
X

దిశ, డైనమిక్ బ్యూరో: లెజెండ్ బాలయ్య- మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2’ (Akhanda 2) సినిమా ట్రైలర్‌ వచ్చేసిందే. శుక్రవారం కర్ణాటక చిక్కబళ్లాపురలో ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే బాలయ్య డైలాగ్స్, మంచు కొండల్లో ఫైట్ సీన్స్‌ విపరీతంగా ఆకట్టుంటున్నాయి. సనాతన ధర్మం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్‌.. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్‌.. అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగులు, విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ సారి వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై మరింత ఫోకస్ చేసినట్లుగా ట్రైలర్‌లో కన్పిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందు రానున్నట్లు తెలుస్తోంది. విశ్వరూపం చూపించాడని ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ.. ఒక సాధారణ వ్యక్తి, మరోవైపు అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ది తాండవం, జాజికాయ లాంటి లిరికల్ సాంగ్స్‌ను రిలీజ్ చేశారు.

Next Story