- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jailer- 2: జైలర్-2 లో బాలకృష్ణ.. రజినికాంత్ సినిమాపై హైప్ పెంచేస్తున్న ట్వీట్
‘జైలర్’ (Jailer) సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

దిశ, సినిమా: ‘జైలర్’ (Jailer) సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘జైలర్-2’ (Jailer- 2) ఒకటి. సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న జైలర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన టీజర్(teaser)కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా.. మొదటి పార్ట్‌లో నటించిన నటీనటులు వసంత్ రవి, మీర్నా మీనన్, యోగిబాబు, వినాయకన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు ఇప్పుడు ‘జైలర్-2’లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే.. టీజర్ తర్వాత ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి అభిమానులకు కూడా కిక్ ఇచ్చే ఓ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా ప్రచారం అవుతుంది. ‘జైలర్-2’లో నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కామియో రోల్(Cameo role)లో నటిస్తున్నట్లు తమిళ్ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే దీనికోసం బాలయ్యతో సంప్రదింపులు జరపగా ఆయన కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వైరల్ అవుతున్న ట్వీట్స్.. రజినీకాంత్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
#Jailer2 - Jai Balayaa....💥 pic.twitter.com/y5ogGe9cpi
— Movie Tamil (@MovieTamil4) April 30, 2025






