సెన్సేషనల్ ట్విస్ట్.. పవన్ ‘హరిహర వీరమల్లు’లో నటసింహం బాలకృష్ణ!

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-23 03:07:03  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో జులై 24వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

సెన్సేషనల్ ట్విస్ట్.. పవన్ ‘హరిహర వీరమల్లు’లో నటసింహం బాలకృష్ణ!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో జులై 24వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. స్వయంగా పవన్ కల్యాణే.. రంగంలోకి దిగి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే.. తెల్లవారితే సినిమా రిలీజ్ ఉండగా.. ప్రముఖ యట్యూబర్ నా అన్వేషణ పవన్ కల్యాణ్ అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘ఇప్పుడే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో హైలైట్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఎంట్రీ. శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో నటించారు. పవన్ కల్యాణ్, బాలయ్య వచ్చే సీన్‌లో గూస్‌బంప్స్ పక్కా. మీరు తప్పుకుండా ఎంజాయ్ చేస్తారు’ అని నా అన్వేషణ చెప్పుకొచ్చారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాలి. ప్రస్తుతం నా అన్వేషణ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌‌ను క్రిష్‌, జ్యోతికృష్ణలు డైరెక్ట్ చేశారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. ఏఎం రత్నం నిర్మించగా, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Next Story