నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరు: బాలయ్య

by Ajay Maddhiboyina |

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలపై న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ స్పందించారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో గెలిచిన అభ్య‌ర్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరు: బాలయ్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలపై న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ స్పందించారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో గెలిచిన అభ్య‌ర్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మోడీ, అమిత్ షా సార‌థ్యంలోనే న‌వ‌భార‌త నిర్మాణం సాధ్య‌మ‌ని అన్నారు. అంతేకాకుండా త‌మిళ‌నాడులో విజ‌యం సాధించిన టీవీకే అధినేత విజ‌య్ కి ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్ర‌భంజ‌నాన్ని మ‌ళ్లీ విజ‌య్ తీసుకువ‌చ్చార‌ని కొనియాడారు. న‌టులు త‌లుచుకుంటే చ‌రిత్ర తిర‌గ‌రాయ‌గ‌ల‌ర‌ని మ‌రోసారి నిరూపించారు.

గ‌తంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇదే విష‌యాన్ని నిరూపించార‌ని అన్నారు. త‌మిళ ప్ర‌జ‌ల ఆశ‌లు నెర‌వేర్చ‌డ‌మే ఆశ‌యంగా విజ‌య్ పాల‌న సాగాల‌ని కోరుకున్నారు. ఇక త‌మిళ‌నాట టీవీకే సాధించిన విజ‌యం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అక్క‌డ ఏళ్లుగా అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌ను వెన‌క్కి నెట్టి విజ‌య్ పెట్టిన టీవీకే దూసుకురావ‌డం షాకింగ్ గా మారింది. 107 స్థానాల‌తో విజ‌య్ టీవీకే అతిపెద్ద‌పార్టీగా అవ‌త‌ర‌లించింది. దీంతో విజ‌య్ సీఎం అయ్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

Next Story