- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BB5 : బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో మరో సినిమా ?
బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ 4 సినిమాలు వచ్చి, సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు 5వ సినిమా రాబోతుందట.

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి బాలయ్య తాజాగా చేసిన అఖండ 2 సినిమా థియేటర్ లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన ఈ మూవీ నార్త్ లో కూడా బాగా నడుస్తోందట. హిందూ ధర్మం, శివుడి చుట్టూ సినిమా కథ ఉండటంతో జనాలు ఎగబడి చూస్తున్నారని టాక్. అయితే, అఖండ 2 సినిమా సక్సెస్ అయిన తరుణంలో బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ మరో సినిమా కూడా పట్టేలెక్కనున్నట్లు ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రానుందట. ఇప్పటికే బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ 4 సినిమాలు వచ్చి, సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు 5వ సినిమా రాబోతుందట. త్వరలోనే విజయ్ దేవరకొండతో బోయపాటి శ్రీను సినిమా చేయనున్నారట. ఆ మూవీ ఫినిష్ కాగానే, బాలయ్య ప్రాజెక్ట్ ప్రారంభం కానుందట. 2027 వరకు ఈ మూవీ పట్టాలెక్కనుందని టాక్ నడుస్తోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ, అఖండ 2 సినిమాలు వచ్చాయి.






