- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bad Girl : దుమారం రేపుతున్న Bad Girl టీజర్
ప్రస్తుతం బాలీవుడ్ లో "బ్యాడ్ గర్ల్"(Bad Girl) టీజర్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం బాలీవుడ్ లో "బ్యాడ్ గర్ల్"(Bad Girl) టీజర్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అంజలి శివరామన్(Anjali Shivaraman) లీడ్ రోల్ పోషిస్తుండగా.. వర్ష భరత్(Varsha Bharat) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెట్రి మారన్(Vetrimaran) మరియు అనురాగ్ కశ్యప్(Anurag Kshyap) సమర్పించారు. ఈ చిత్రం టీజర్ ను జనవరి 26న విడుదల చేయగా.. ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేసేలా తీసిన కథలకు జనాల్లో కూడా భారీ ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాడ్ గర్ల్ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో తనకు బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకునే ఓ అమ్మాయి తీరును, ఆమె జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను చూపించారు. స్కూల్ స్టేజీ నుంచే తోటి తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకునే బ్రాహ్మణ అమ్మాయి(Brahmin Girl) కథనే ఈ సినిమా అని బ్యాడ్ గర్ల్ టీజర్ ద్వారా అర్థమవుతోంది.
అయితే ఈ చిత్రంలో బ్రాహ్మణ అమ్మాయిని తప్పుగా చూపించారని పలువురు స్టార్ డైరెక్టర్లు విమర్శించడం నెట్టింట్లో చర్చకు దారి తీసింది. అర్జున్ రెడ్డి(Arjun Reddy), కబీర్ సింగ్(Kabir Singh), యానిమల్(Animal) వంటి సినిమాలు విడుదలైనప్పుడు ఇలాంటి విమర్శలు ఎందుకు చేయలేదని నెటిజన్లు వీరికి గట్టిగానే సమాధానాలు చెబుతున్నారు. మరోవైపు ధనుష్(Dhanush), పా రంజిత్(Pa Ranjith) లాంటి డైరెక్టర్స్ మాత్రం ఈ చిత్రానికి మద్దతు తెలిపారు. జనవరి 31, 2025న రోటర్‌డ్యామ్(Roterdam)లో జరగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(International Film Festival)లో ఈ చిత్రం ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు చిత్ర యూనిట్. కాగా థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.






