Aishwarya Rai: ఐశ్వర్య పేరులో బచ్చన్ మిస్.. విడాకుల వార్తలే నిజమయ్యాయా?

by Chukka Sudharani |   (  Updated:2024-11-28 16:02:47  IST  )

బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) లు పలు సినిమాల్లో కలిసి నటించారు.

Aishwarya Rai: ఐశ్వర్య పేరులో బచ్చన్ మిస్.. విడాకుల వార్తలే నిజమయ్యాయా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) లు పలు సినిమాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలోనే ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే.. గత కొద్ది కాలంగా ఈ జంట దూరంగా ఉంటున్నట్లు, త్వరలో విడాకులు (divorce) తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. వీటిపై ఇప్పటికి క్లారిటీ (clarity) రాలేదు. కానీ ఐశ్వర్య, అభిషేక్‌ల విడాకులు ఇష్యూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ (hot topic)గా చక్కర్లు కొడుతూనే ఉంది.

ఇందులో భాంగంగా మరోసారి వీరి విడాకుల ఇష్యూ (issue) తెరపైకి వచ్చింది. ఇటీవల దుబాయ్ (Dubai)లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫారమ్ (Global Women's Form) ఈవెంట్‌లో ఐశ్వర్య రాయ్ పాల్గొంది. ఆమె స్టేజ్ మీదకు వచ్చే క్రమంలోనే బ్యాక్ సైడ్ స్క్రీన్‌పై ఐశ్వర్య రాయ్ అనే పేరును మెన్షన్ చేశారు. దీంతో ఐశ్వర్య పేరు చివర బచ్చన్ లేకపోవడంతో బాలీవుడ్‌లో మరోసారి వీరి విడాకుల ఇష్యూ హాట్ టాపిక్ అయింది. అంతే కాకుండా.. ఐశ్వర్య బచ్చన్ అని కాకుండా ఐశ్వర్య రాయ్ అనే పేరు వచ్చిందంటే.. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు నిజమై ఉంటుందా అంటూ మీడియా కోడై కూస్తుంది. మరి దీనిపై ఐశ్వర్య, బచ్చన్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

Read More...

Ananya Pandey: ఒక బంధం బలపడాలంటే నిజాయితీ ఉండాలి.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్


Next Story