Ananya Pandey: ఒక బంధం బలపడాలంటే నిజాయితీ ఉండాలి.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

‘లైగర్’ (Liger) సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే

Ananya Pandey: ఒక బంధం బలపడాలంటే నిజాయితీ ఉండాలి.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘లైగర్’ (Liger) సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే (Ananya Pandey).. తెలుగులో అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. దీంతో ప్రజెంట్ బాలీవుడ్ (Bollywood)లో పలు సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఏ బంధమైన బలపడుతోందని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపింది. ‘గతంలో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నా. ఆ వ్యక్తి కోసం నేనెంతగానో మారాను. చాలా విషయాల్లో రాజీపడ్డాను. మనం ఓ రిలేషన్ (relationship)లో ఉన్నప్పుడు ఇష్టపడే వారి కోసం ఎంత మారినా పర్వాలేదనిపిస్తుంది. మనం మారుతున్నామనే విషయం మొదట్లో మనకు అర్థం కాదు. ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే.. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు. ఒకసారి రిలేషన్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు మనకు అన్నీ అర్థం అవుతాయి. అయితే నేను మాత్రం రిలేషన్‌షిప్‌లో నిజాయతీగా ఉంటాను. అలాగే ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుంది’ అపి చెప్పుకొస్తూ తనకు కాబోయే వ్యక్తి అన్నివిధాలా తనను అర్థం చేసుకునేవాడు అయి ఉండాలని చెప్పుకొచ్చింది అనన్య పాండే.

Next Story