ఎమోషనల్ ట్వీట్ చేసిన బేబీ నిర్మాత.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తున్న వీడియో

by Mallepaka Hamsa |

నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.

ఎమోషనల్ ట్వీట్ చేసిన బేబీ నిర్మాత.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తున్న వీడియో
X

దిశ, సినిమా: నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో మృతి చెందిన కుటుంబాల రోధనలు మిన్నంటాయి. మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకుల కాల్పులు జరపగా.. ఇందులో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇక పెను విషాదంపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ సంఘటనపై స్పందిస్తూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, బేబీ సినిమా నిర్మాత ఎస్‌కెఎన్(SKN) ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

పహల్గాం(Pahalgam) ఘటనలో బతికి బయటపడ్డ వారు రోధిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ‘‘భయం, బాధ, ఆందోళన.. గుండెలను పిండేసే వీడియో పహల్‌గామ్‌లోని బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న పలువురు భయంతో వణికిపోయారు. కొండలు, గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఓ చోట కుప్పకూలిపోయారు. కళ్ల ముందే బిడ్డలను, భర్తలను, బంధువులు, స్నేహితులను, పేరెంట్స్‌ని కోల్పోయిన బాధతో గుక్కపట్టి ఏడ్చారు. కాపాడటానికి వచ్చిన జవాన్లను చూసి కూడా భయపడ్డారు... చంపొద్దని వేడుకున్నారు. గుండెలను పిండేసే వీడియో’’ అని రాసుకొచ్చారు. అలాగే ఏడుస్తున్న ఎమోజీతో పాటు దండం సింబల్ షేర్ చేశారు. ప్రస్తుతం నిర్మాత పెట్టిన వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.

Next Story