క్షమాపణలు చెప్పాలని కోరిన బేబీ డైరెక్టర్.. అసలు నిజాలు బయటపెడుతూ హీరో సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ హీరో బాబిల్ ఖాన్(Babil Khan) ఇండస్ట్రీ నకిలీ అని చెప్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

క్షమాపణలు చెప్పాలని కోరిన బేబీ డైరెక్టర్.. అసలు నిజాలు బయటపెడుతూ హీరో సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో బాబిల్ ఖాన్(Babil Khan) ఇండస్ట్రీ నకిలీ అని చెప్తూ ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా అర్జున్ కపూర్, అనన్య పాండే(Ananya Pandey), షనాయా,అర్జిత్ సింగ్(Arjit Singh) ఇలా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని కన్నీళ్లు పెట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక బాబిల్ ఖాన్ పోస్ట్ నిమిషాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై పలువురు విమర్శలు చేయడంతో వెంటనే పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అంతేకాకుండా ఆయన టీమ్ కూడా వివరణ ఇస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా, బాబిల్ ఖాన్ పోస్ట్‌పై టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) స్పందిస్తూ సంచలన పోస్ట్ పెట్టాడు. ‘‘మేము ఏమైనా పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? మీరు ఏం చేసినా మాట్లాడకుండా ఉంటామని అనుకుంటున్నావా? వీడియోలో చెప్పిన వాల్లు మాత్రమే మంచి వాళ్లు అయితే.. ఇంతకాలం నీకు సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా? గంట ముందు వరకు బాబిల్‌ఖాన్ సపోర్ట్ చేయాలని అనుకున్నా.

కానీ అతని పోస్ట్ చూశాక ఆగిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు. నువ్వు నిజాయితీతో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌పై బాబిల్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. ‘‘నా మనసు ముక్కలు చేశారు. నేను నీకోసం చేయాల్సిందంతా చేశాను. నా రెండేళ్ల జీవితాన్ని నీకు ధారపోశాను. ఒళ్ళు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నాను. అవకాశాలు వచ్చినప్పటికీ నీకోసం అన్నింటిని వదులుకున్నా. మురికి కుంటల్లో బొర్లాను. నీకోసం చేయి కూడా కోసుకున్నా. కానీ అన్ని చేసినా నువ్వు మాత్రం ఆఫర్ ఇవ్వలేదని’’ అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వెంటనే వారు డిలీట్ చేశారు. అయినప్పటికీ కొందరు స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Next Story