- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గరికపాటి అలా మాట్లాడటం తప్పే.. నా అన్వేషణకు బాబు గోగినేని సపోర్ట్
అన్వేష్‌కు హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబుగోగినేని మద్దతు ప్రకటించారు. అన్వేష్ తాను మాట్లాడినదానికి క్షమాపణలు చెప్పారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ అన్వేష్ వర్సెస్ శివాజీ అండ్ గరికపాటి సపోర్టర్స్ మధ్య సోషల్ మీడియాలో మాట యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. శివాజీ, గరికపాటి మహిళలపై చేసిన కామెంట్స్ ను అన్వేష్ ఖండించాడు. ఈ క్రమంలో అన్వేష్ పై తీవ్ర వ్యతిరేఖత మొదలవ్వగా చాలా మంది ఆయన యూట్యూబ్ ఛానల్‌ను అన్ సబ్ స్క్రైబ్ చేయడంతో పాటు ఇన్ స్టాగ్రామ్ పేజీని అన్ ఫాలో చేస్తున్నారు. కాగా తాజాగా అన్వేష్‌కు హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబుగోగినేని మద్దతు ప్రకటించారు. అన్వేష్ తాను మాట్లాడినదానికి క్షమాపణలు చెప్పారని అన్నారు.
మాట్లాడినదానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండి మాట్లాడిన అన్వేష్ పై కేసులు పెట్టవచ్చా లేదా అని లాయర్లు తేల్చాల్సి ఉందన్నారు. గరికపాటి ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆడవాళ్ల శరీరం చూస్తే తనకు 50ఏళ్లు దాటినా ఆగలేకపోతున్నానని చెప్పడం నీచమైన భాష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గరికపాటి గురించి అన్వేష్ మాట్లాడింది నిజమేనని అన్నారు.
నా అన్వేషణ కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. అందరికీ కోపాలు ఉన్నప్పుడు ఏ భాష మాట్లాడతామనేది ముఖ్యం అన్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ షోపై కూడా బాబుగోగినేని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఇద్దరు ముగ్గురు మహిళలను అసభ్యంగా తాకాడని వాళ్లే వచ్చి తనకు చెప్పారన్నారు. అయితే అతడి పేరు చెప్పను అని అలా చేసిన వ్యక్తే మీడియా ముందుకు వచ్చి ఒప్పుకోవాలన్నారు.






