- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బాహుబలి ది ఎపిక్’ రీ రిలీజ్...థియేటర్ లో శివగామి సీన్ రిపీట్
ప్రభాస్ హీరో, రాణా అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి అప్పట్లో ప్రభంజనం

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరో, రాణా అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి అప్పట్లో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసి, జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఇప్పుడు అదే బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ పేరుతో సినిమాను రీ- రిలీజ్ చేశారు. దీంతో థియేటర్ లో ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.
లక్షల్లో టికెట్ల విక్రయాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో థియేటర్ లో సినిమా చూస్తున్న అభిమానులు చేసే రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో శివగామి.. యంగ్ ప్రభాస్ ను నీటిలో ఎత్తుకునే సీన్ వచ్చింది. ఆ సీన్ రాగానే అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు రమ్యకృష్ణ చేసినట్లుగానే ఓ వ్యక్తిని.. థియేటర్ లో పైకి లేపి, అదే సీన్ రిపీట్ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ సినిమా రీ-రిలీజ్ అయితే రచ్చ ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్






