- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమౌళి బర్త్ డే...'బాహుబలి' మేకింగ్ వీడియోతో స్పెషల్ ట్రీట్
జక్కన్న పుట్టినరోజు నేపథ్యంలో బాహుబలి చిత్ర బృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. కానీ ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఎస్.ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా జక్కన్న చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆస్కార్ దాకా తీసుకువెళ్లాడు. అలాంటి రాజమౌళి తాజాగా 52 సంవత్సరాల్లోకి అడుగు పెట్టాడు.
అయితే జక్కన్న పుట్టినరోజు నేపథ్యంలో బాహుబలి చిత్ర బృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసి, జక్కన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇందులో బాహుబలి విజయానికి రాజమౌళి ఎంత మేరకు కష్టపడ్డాడో అర్థమవుతుంది. ప్రతీ సీన్ చాలా కష్టపడి, తీయించారు. అందులో లీనమై, మంచి సినిమాను అందించారు. సింపుల్ గా వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా బాహుబలి సినిమా రెండు భాగాలను త్వరలోనే కలిపి రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీన రీ-రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.






