నీ వక్షోజాలు మస్త్ ఉన్నయ్.. కన్ను కొడుతూ.. అసభ్యకరంగా బాబాయ్ వేధింపులు.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-10 10:15:52  IST  )

అయేషా ఖాన్ హిందీ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. లవ్ ఎఫైర్ కారణంగా ఫేమ్ పొందిన ఆమె.. ఆ తర్వాత బయటకు వచ్చాక వరుస ఆఫర్లు అందుకుంది. తెలుగులో ఐటెమ్ సాంగ్స్ చేసిన ఆమె..

నీ వక్షోజాలు మస్త్ ఉన్నయ్.. కన్ను కొడుతూ.. అసభ్యకరంగా బాబాయ్ వేధింపులు.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: అయేషా ఖాన్ హిందీ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. లవ్ ఎఫైర్ కారణంగా ఫేమ్ పొందిన ఆమె.. ఆ తర్వాత బయటకు వచ్చాక వరుస ఆఫర్లు అందుకుంది. తెలుగులో ఐటెమ్ సాంగ్స్ చేసిన ఆమె.. బెంగాలీ మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చింది. కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదని.. చికెన్ తినాలని ఉన్నా.. కొనుక్కోలేని దుస్థితిలో ఉండేవాళ్లమని తెలిపింది. ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్‌కు చేరుకున్నామని వివరించింది.

అయితే చిన్న వయసులోనే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని.. ఇందుకు సంబంధించిన వివరాలు బయటపెట్టింది. తను రోడ్డు మీద నడుస్తుండగా.. వెనక నుంచి మా నాన్న ఫ్రెండ్ పిలిచాడని.. బాబాయ్ పిలవగానే వెనక్కి చూశానని తెలిపింది. దీంతో తనకు దగ్గరగా వచ్చి.. నీ వక్షోజాలు మస్త్ ఉన్నాయని చెప్పి.. బైక్ మీద వెళ్లాడని చెప్పింది. ఏం జరిగిందని తెలుసుకునేలోపే.. మళ్లీ వెనక్కి చూస్తే కన్ను గీటుతూ.. అసభ్యకరంగా సంజ్ఞలు చేశాడని తెలిపింది అయేషా ఖాన్.

Next Story