- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhil: 'Akhil6' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
అక్కినేని అఖిల్ (Akhil) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్లు పూర్తవుతోంది.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ (Akhil) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్లు పూర్తవుతోంది. 2015లో ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని వారసుడుకి ఇప్పటికి ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి మూవీస్‌తో ప్రేక్షకులను అలరించినప్పుటికీ.. అనుకున్నంత స్థాయిలో హీరోగా రాణించలేకపోయాడు. ఇక 2022లో ‘ఏజెంట్’ (Agent) చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. భారీ బడ్జెట్(Big budget)తో తెరకెక్కిన ఈ మూవీ కూడా అఖిల్‌కు నిరాశే మిగిల్చింది.
దీంతో.. అఖిల్ నెక్ట్స్ చేసే ప్రాజెక్ట్ అన్నా సక్సెస్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. దీంతో 'Akhil6' నుంచి అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి దాదాపు ఏడాది అవుతుంది కానీ, ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. 'Akhil6' నుంచి అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ (First look poster) ఏప్రిల్ 8న రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. వెయిటింగ్.. ఎగ్జైటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. కాగా.. ఈ 'Akhil6'కి అక్కినేని నాగార్జున అండ్ నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.






