రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ దంపతులకు అవార్డు.. ఎందుకంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-24 16:18:08  IST  )

ప్రపంచం మొత్తం ఆరోగ్యవంతమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచిన యోగా దినోత్సవాన్ని జూన్ 21 అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ దంపతులకు అవార్డు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం మొత్తం ఆరోగ్యవంతమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచిన యోగా దినోత్సవాన్ని (International Yoga day) జూన్ 21న అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. భారత్‌లో కూడా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెప్రాంతాల్లో కూడా వేలాది మంది ప్రజలు ఉదయం యోగా వేడుకలకు హాజరై సూర్య నమస్కారాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానం వంటి యోగాసానాలు ఆచరించారు. అలాగే సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఈ యోగా వేడుకల్లో పాల్గొని, ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ క్రమంలో యోగా ఫిటెన్స్ ప్రాముఖ్యతను తెలియ‌జేస్తూ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth sing) ఆమె భ‌ర్త‌ నటుడు-నిర్మాత జాకీ భగ్నాని (Jockey Bhaggani) ఢిల్లీలో నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో సూర్య నమస్కారాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఈ జంట అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. తమకు 'ఫిట్ ఇండియా కపుల్ (Fit India Couple)' అవార్డు లభించినట్లు రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. యోగా పట్ల ప్రజలను ఆకర్షించడంలో తాము భాగం కావడం ఆనందంగా ఉందని రకుల్ పేర్కొన్నారు. ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు అవసరం లేకుండా ఇంట్లోనే యోగాతో ఫిట్‌గా మారొచ్చని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు, దేశంలోనే ఈ అవార్డు అందుకున్న ఏకైక జంటగా రకుల్ ఆమె భర్త నిలిచారు.

Click For Tweet..

Next Story