‘అవతార్’ ఫ్రాంచైజ్ భారీ రికార్డ్

by Naga Rani Yarlagadda |

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని అవతార్ ఫ్రాంచైజీతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్.

‘అవతార్’ ఫ్రాంచైజ్ భారీ రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని అవతార్ ఫ్రాంచైజీతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. 2009లో ఈ ఎపిక్ వండర్ మొదలవ్వగా.. అవతార్, అవతార్ - ది వే ఆఫ్ వాటర్, అవతార్ - ఫైర్ అండ్ యాష్.. ఇలా మూడు సినిమాలొచ్చాయి. మొదటి రెండు సినిమాలు నెవర్ బిఫోర్ ట్రీట్ ను అందించగా.. ఇటీవలే విడుదలైన పార్ట్ 3 కూడా మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఇంతవరకూ వచ్చిన ఏ ఫ్రాంచైజీ లేదా ట్రయాలజీల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన ఫ్రాంచైజ్ గా నిలిచినట్లు తెలుస్తోంది.

అవతార్ మూడు సినిమాలు ఏకంగా 5.6 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ ను వసూలు చేశాయి. ఇప్పటికీ అవతార్ 3 థియేటర్లలో రన్ అవుతుండగా.. కలెక్షన్లు మరింత పెరుగుతాయని తెలుస్తోంది. నెక్స్ట్ స్టార్ వార్స్, జురాసిక్ వరల్డ్, స్పైడర్ మ్యాన్, హాబ్బిట్ ట్రయాలజీలు ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలుగా ఉన్నాయి. ఏదేమైనా జేమ్స్ కామెరూన్ 3 సినిమాలతో మ్యాజిక్ చేశాడని అంటున్నారు.

Next Story