Chandrahas: నేను ప్రభాకర్ కొడుకు కాకపోయి ఉంటే, చాలా సినిమాలలో ఛాన్స్ వ‌చ్చేది

by velandi.Saikiran |

ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, తన టాలెంట్ ద్వారా స్టార్ హీరోగా ఎదగాలన్న కసి మాత్రం ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లో కనిపిస్తుంది.

Chandrahas: నేను ప్రభాకర్ కొడుకు కాకపోయి ఉంటే, చాలా సినిమాలలో ఛాన్స్ వ‌చ్చేది
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది బ్యాగ్రౌండ్ చూసుకొని ఎదుగుతుంటే, మరికొంతమంది సొంత కాళ్లపై ఎదుగుతున్నారు. తమ టాలెంట్ ద్వారా రాణిస్తూ ఇరగదీస్తున్నారు. ఇక కొంతమంది బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి, ఎదిగే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కావడం లేదు. అలాంటి వారిలో ఈటీవీ ప్రభాకర్ కొడుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఒకరు. చేసింది తక్కువ సినిమాల అయినప్పటికీ, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్లుగా ఉంటుంది చంద్రహాస్ వ్యవహారం.

అయితే ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, తన టాలెంట్ ద్వారా స్టార్ హీరోగా ఎదగాలన్న కసి మాత్రం ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లో కనిపిస్తుంది. 2019లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చంద్రహాస్ రాంనగర్ బన్నీ, కాయిన్‌ లాంటి సినిమాలతో మెరిశాడు. అయితే ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ ఎక్కడ కూడా చంద్రహాస్ కు తగలలేదు. అయితే అలాంటి చంద్రహాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభాకర్ కుమారుడు కాకపోయి ఉంటే, ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలలో చేసే అవకాశం వచ్చేదని బాంబు పేల్చారు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. అందుకే ఇప్పుడు తన కెరీర్ ఇలా తయారయిందని పేర్కొన్నాడు. దీంతో చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా త్వ‌ర‌లోనే బరాబర్ ప్రేమిస్తా సినిమాతో వ‌స్తున్నాడు.




Next Story