- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrahas : నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానంగా.. మరో సినిమా అనౌన్స్ చేసిన ఆటిట్యూడ్ స్టార్
బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు.

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. నేడు చంద్ర హాస్ బర్త్‌డే కావడంతో.. ఆ సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘కాయిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ ప్రజెంట్ వైరల్ అవుతున్నది.
ఈ సందర్భంగా ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ ‘కాయిన్’ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నేను కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. అన్ని రకాల చిత్రాలను చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. కథను, సినిమాల్ని పూర్తిగా నేనే ఓకే చేస్తాను. నాన్న అప్పుడప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను’ అని అన్నారు.
- Tags
- Chandrahas
- Coin






