- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అంటూ కూతురు పేరును రివీల్ చేసిన హీరోయిన్.. క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్స్!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి(Athiya Shetty)కి పరిచయం అక్కర్లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి(Athiya Shetty)కి పరిచయం అక్కర్లేదు. నటుడు సునీల్ శెట్టి(Sunil Shetty) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె ‘హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మూడు చిత్రాల్లో నటించిన ఆమె ఇండస్ట్రీకి దూరం అయింది. ఈ క్రమంలోనే అతియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2023 జనవరి నెలలో జరిగింది. ఇక గత ఏడాది ప్రెగ్నెంట్ అయిన అతియా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తన బేబీ బంప్ ఫొటోలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ అమ్మడు మార్చి 24న పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించి అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. కానీ కూతురు ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా, అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన కూతురి పేరును రివీల్ చేసింది. భర్త, కూతురుతో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. తన గారాల పట్టికి ‘‘ఈవారా’’ అని నామకరణం చేసినట్లు తెలిపింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘దేవుడి ఇచ్చిన గొప్పవరం. మాకు అన్నీ తానే’’ అని క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా ఈ పేరుకు అర్థం.. ఈవారా అంటే దేవుని గిఫ్ట్ అని తెలుస్తోంది. ఇక v విపుల (అతియా శెట్టి వాళ్ల అమ్మమ్మ (మనాశెట్టి) తల్లి పేరు.. అలాగే R అంటే రాహుల్ అని పెట్టినట్లు వివరించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా క్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అతియా పోస్టును అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ, స్టార్ బ్యూటీ సమంతతో పాటు పలువురు సినీ స్టార్స్ లైక్ చేస్తున్నారు.






