Atharva : ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌తో చాలా గర్వంగా ఉన్నాం.. ఆ సినిమాపై యంగ్ హీరో కామెంట్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ప్రస్తుతం తన 25వ చిత్రం ‘పరాశక్తి’తో బిజీగా ఉన్నాడు.

Atharva : ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌తో చాలా గర్వంగా ఉన్నాం.. ఆ సినిమాపై యంగ్ హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ప్రస్తుతం తన 25వ చిత్రం ‘పరాశక్తి’తో బిజీగా ఉన్నాడు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కర్ నిర్మిస్తున్నారు. సుధ కొంగుర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ పీరియాడికల్ డ్రామాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. దీంతో ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న అథర్వ రీసెంట్‌గా DNA అనే థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రజెంట్ మంటి టాక్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అథర్వ ‘పరాశక్తి’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘పరాశక్తి’ స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60% పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌తో మేము చాలా గర్వంగా & సంతోషంగా ఉన్నాము. శ్రీలీల ఇప్పటివరకు చేసిన తెలుగు చిత్రాల కంటే.. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది’ అని తెలిపాడు.


Next Story