రెండో రిలీజ్‌లో కూడా రెచ్చిపోతున్న 'అతడు'.. బుకింగ్స్ ఓపెన్ కాగానే ట్రెండింగ్

by Pulgam srinivas |

అతడు చిత్రాన్ని ఫిబ్రవరి 28వ తేదీన రీ రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో ఓపెన్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

రెండో రిలీజ్‌లో కూడా రెచ్చిపోతున్న అతడు.. బుకింగ్స్ ఓపెన్ కాగానే ట్రెండింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ప్రస్థానంలో క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయిన వాటిలో 'అతడు' ఒకటి. 2005లో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద నెంబర్లను రాబట్టలేకపోయినా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకుంది. గత కొద్దికాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎన్నో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే రీ రీ రిలీజ్ లు కూడా చేస్తున్నారు. అందులో కొన్ని సినిమాలకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.

ఇక మహేష్ నటించిన 'అతడు' సినిమాను కూడా కొంతకాలం క్రితం రీ రిలీజ్ చేశారు. అప్పుడు ఈ క్లాసిక్ కి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28వ తేదీన రీ రీ రిలీజ్ చేయనున్నారు. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ బుక్ మై షో లో ఓపెన్ అయ్యాయి. ఇలా ఓపెన్ అయ్యాయో లేదో అలా ఈ సినిమా ట్రేండింగ్లోకి వచ్చేసింది. మహేష్ అభిమానులు ఈసారి కూడా 'అతడు' గట్టిగానే వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. సోనూసూద్, ప్రకాష్ రాజు, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సునీల్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. జయభేరి బ్యానర్లో ప్రముఖ నటుడు మురళీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Next Story