- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. షూటింగ్ స్పాట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
by Sujitha Rachapalli |
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో బొరెల్లా కన్ను మూశారు. ఆగస్టు 21న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇటలీలోని వెనిస్‌లో

X
దిశ, వెబ్ డెస్క్ : నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో బొరెల్లా కన్ను మూశారు. ఆగస్టు 21న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇటలీలోని వెనిస్‌లో ఈ సిరీస్‌కు సంబంధించిన ఐదో సీజన్ ఫైనల్ సీన్ చిత్రీకరిస్తుండగా.. హోటల్ డానియేలీ దగ్గర కుప్పకూలాడు. సెట్‌లో ఉన్న వైద్య సిబ్బంది ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారని నిర్ధారణ అయింది. గుండెపోటు కారణంగా చనిపోవచ్చని ఇంటర్నేషనల్ మీడియా ప్రచురించింది. కానీ అధికారిక ప్రకటన రిలీజ్ కాలేదు. ఇక సిరీస్ నిర్మాణ సంస్థ పారామౌంట్ టెలివిజన్ స్టూడియోస్ ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామంటూ ప్రకటన రిలీజ్ చేసింది. డియాగో మరణానికి సంతాపం తెలుపుతూ రెండు రోజులు చిత్రీకరణ నిలిపేసింది.
Next Story






