- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రావణాసుడి గెటప్ లో టాలీవుడ్ విలన్.. ఈ వీడియో చూస్తే
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది విలన్ పాత్రలలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే... ఇందులో కొంతమంది మాత్రమే

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది విలన్ పాత్రలలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే... ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో అశుతోష్ రాణా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే... కచ్చితంగా విలన్ పాత్రలో అశుతోష్ రాణా కనిపిస్తారు. కొన్ని సినిమాలలో కామెడీ విలన్ గా కూడా మెరిశారు. ముఖ్యంగా మాస్ మహారాజ్ హీరోగా చేసిన వెంకీ సినిమాలో డీజీపీ పాత్రలో కనిపించి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో భూమారెడ్డి పాత్రలో కూడా దుమ్ము లేపారు.
అయితే... తాజాగా ఈయన... రావణాసురుడి గెటప్ లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను విలన్ గానే కాకుండా... రావణాసురుడిగా కూడా అందరినీ అలరించగలను అంటూ... ఈ వీడియో ద్వారా చెప్పేశారు. ఇక ఇందులో ఆయన గెటప్.. అరివీర భయంకరంగా ఉంది. రావణాసురుడి కంటే భయంకరంగా కనిపించారు అశుతోష్ రాణా. ఈ వీడియోను చూసిన సినిమా ప్రియులు.. ఆయన గెటప్ ను మెచ్చుకుంటున్నారు.
Instagramme Link






