- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతన్ని కిస్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ బర్త్‌డే విష్ చేసిన అషిక రంగనాథ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది.
ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఒకతనితో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటోలు షేర్ చేసింది. అలాగే అతని బుగ్గమీద కిస్ చేస్తున్న పిక్‌ను కూడా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే రాజీవా అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా..నెటిజన్లు అతను అషిక బ్రదర్ కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






