- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘శతమానం భవతి’ సీక్వెల్.. హీరో ఎవరంటే?
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా నటించిన సినిమా ‘శతమానం భవతి’.

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా నటించిన సినిమా ‘శతమానం భవతి’. జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ 2017లో వచ్చి ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ నిర్మాత ఈ మూవీ సీక్వెల్ తీసుకువచ్చే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమా ‘శతమానం భవతి: ది లాస్ట్ పేజ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో దిల్ రాజు (dil raju) అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్ని అనుకున్న విధంగా అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు నెట్టింట పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ మూవీకి సంబంధించిన పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాటిని చూసిన వారంతా మరో హిట్ ఖాయం అని అంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి అన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతూ హిట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ‘శతమానం భవతి’ రాబోతుండటంతో అంతా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
#M9Exclusive
— M9 NEWS (@M9News_) April 5, 2025
దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ ప్లాన్ లో ఉన్న సంగతి తెలిసిందే...
వంశీ పైడిపల్లి టీమ్ లో పనిచేసిన ఒకరు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమాకు "Shatamanam Bhavathi: The Last Page" అనే టైటిల్ పరిశీలనలో ఉంది
ఆశిష్ హీరో... అన్నీ కుదిరితే సంక్రాంతి 2026 రిలీజ్






