Arrest: ‘గేమ్ ఛేంజర్’ మూవీ పైరసీ నిందితుల అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-17 04:55:28  IST  )

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Global Star Ram Charan) ప్రధాన పాత్రలో, దర్శకుడు శంకర్ (Director Shankar) తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

Arrest: ‘గేమ్ ఛేంజర్’ మూవీ పైరసీ నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Global Star Ram Charan) ప్రధాన పాత్రలో, దర్శకుడు శంకర్ (Director Shankar) తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో (North India)లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, మూవీ విడుదల రోజే ఆ చిత్ర నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా హెచ్‌డీ ప్రింట్ (HD Print) అనూహ్యంగా సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అయింది. దీంతో పండుగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీని యథేచ్ఛగా రన్ చేస్తున్నారు.

అదేవిధంగా గాజువాక పట్టణంలోని ఓ లోకల్ టీవీ ఛానల్‌ (Local TV Channel)లో మూవీని ప్రసారం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై సీరియస్‌ అయిన నిర్మాతలు బాధ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన గాజువాక పోలీసులు సదరు టీవీ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా సైబర్ క్లూస్ టీమ్ (Cyber ​​Clues Team) టీవీ ఛానల్‌పై దాడి చేసి టెక్నికల్ ఎక్విప్‌మెంట్‌ (Technical Equipment)ను సీజ్ చేశారు.

Next Story