ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-05-21 22:15:18  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram) తాజాగా నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ( arjun son of vyjayanthi)

ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram) తాజాగా నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ( arjun son of vyjayanthi). ఈ సినిమా గత నెలలో రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా చేయగా.... విజయశాంతి ( Vijayashanthi) ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ గా ఉండగా నిర్మాతలుగా అశోక్, ముప్పా వెంకయ్య చౌదరి వ్యవహరించారు.

ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా... ఇప్పుడు మరో ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రేపటి నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటన కూడా చేసింది చిత్ర బృందం. ఇదివరకే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు మళ్లీ ఆహాలో కూడా అందుబాటులోకి రానుందని... ప్రకటన చేశారు.

Next Story