Arjun Sarja: హీరోగా సీనియర్ నటుడు రీఎంట్రీ.. గ్రాండ్‌గా స్టార్ట్ అయిన మూవీ

by Chukka Sudharani |   (  Updated:2025-08-20 15:13:15  IST  )

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja) మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

Arjun Sarja: హీరోగా సీనియర్ నటుడు రీఎంట్రీ.. గ్రాండ్‌గా స్టార్ట్ అయిన మూవీ
X

దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja) మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) అసిస్టెంట్ డైరెక్టర్ సుభాస్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. AGS నిర్మిస్తోంది. ఇందులో అర్జున్ సరసన అభిరామి జతకట్టనుండగా.. అతని కూతురు పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుంది. ఇది తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ డ్రామాగా తెరకెక్కుతుందని తెలుస్తుండగా.. తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా గ్రాండ్‌గా జరిగాయి. అలాగే ఇది AGS ఎంటర్‌టైన్మెంట్స్‌పై 28వ ప్రాజెక్టుగా రూపొందుతుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘కథలకు ప్రాణం పోసి కొత్త ప్రతిభను పరిచయం చేయడం మాకు చాలా ఇష్టం. మీ అందరి ఆశీస్సులతో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాతో మా తదుపరి నిర్మాణం AGS28 ను సంతోషంగా ప్రటిస్తున్నాము’ అంటూ తెలిపింది AGS నిర్మాణ సంస్థ. కాగా.. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. link

Next Story