Arjun Reddy: బోల్డ్ సీన్స్ చేయాలని టార్చర్ చేశారు.. నటి సంచలనం !

by velandi.Saikiran |   (  Updated:2025-06-29 13:19:08  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులర్

Arjun Reddy: బోల్డ్ సీన్స్ చేయాలని టార్చర్ చేశారు.. నటి సంచలనం !
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులర్ అవుతారు. మరికొంతమంది ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్లకు తగిన గుర్తింపు రాదు. అలాంటి వారిలో అర్జున్ రెడ్డి ఫెమ్ శ్రీ సాయి సుధ కూడా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలే చేసింది శ్రీ సుధా. కానీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రాలేదు.

ఇది ఇలా ఉండగా అర్జున్ రెడ్డి సినిమా అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో శ్రీ సాయి సుధ నటించారు. సినిమా ప్రారంభం కాగానే హీరో అలాగే సాయి సుధ (Arjun Reddy Fame Sai Sudha )మధ్య బోల్డ్ సీన్ ఉంటుంది. ఈ సీన్ అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ బోల్డ్ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీ సుధ.

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి... ఒత్తిడి కారణంగానే బోల్డ్ సీన్ చేయవలసి వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొదట తాను అసలు ఈ సీన్ చేయబోనని.. చెబితే దర్శకుడు మాత్రం అస్సలు వినలేదని పేర్కొంది. సందీప్ రెడ్డి తరహాలోనే నేను కూడా డాక్టర్ ఫీల్డ్ లోనే ఉన్నాను.. అందుకే చేయాల్సి వచ్చిందన్నారు. ఈ బోల్డ్ సీన్ చేస్తే.. జనాలు నన్ను గుర్తుపట్టారు అనుకున్నాను.. కానీ అదే సీన్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ లోనే ఉందన్నారు. తాను ఎక్కువ శాతం అల్లరి నరేష్ సినిమాలు చేసినట్లు గుర్తు చేశారు.

Next Story