Arjun Kapoor: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనంటూ అర్జున్ కపూర్ షాకింగ్ పోస్ట్.. ఆమె గురించేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-27 13:30:31  IST  )

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ప్రముఖ నిర్మాత బోనీ కపూర్( Boney Kapoor ) వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

Arjun Kapoor: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనంటూ అర్జున్ కపూర్ షాకింగ్ పోస్ట్.. ఆమె గురించేనా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ప్రముఖ నిర్మాత బోనీ కపూర్( Boney Kapoor ) వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ముందుగా పలు సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించిన ఆయన నటనపై ఆసక్తితో ‘ఇషాక్ జాదే’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు. ఇక వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అర్జున్ కపూర్ గత ఏడాది ‘సింగం అగైన్’(Singam Again) మూవీలో నటించాడు. ఇక ఇటీవల ‘మేరే హస్పెండ్‌కి బివి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు కానీ హిట్ అందుకోలేకపోయాడు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మాలైకా అరోరా‌ను కొద్ది కాలం ప్రేమించిన విషయం తెలిసిందే.

తనకంటే 11 ఏళ్లు పెద్దది అయినప్పటికీ ఆమెతో డేటింగ్ చేశాడు. ఎంతమంది ఏం అన్నా పట్టించుకోకుండా.. వీరిద్దరు వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ.. బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇక అప్పటినుంచి మలైకా జాడపత్తలేకుండా పోయింది. అర్జున్ కపూర్ మాత్రం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేయసి గుర్తుకు వస్తుండటంతో సోషల్ మీడియా ద్వారా షాకింగ్ పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా, అర్జున్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

‘‘ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నాను. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చివరికి స్వార్థపరులే అని ఎల్లప్పుడే గుర్తుంచుకోండి. ఇది సరైనది లేదా తప్పు అని నేను అనడం లేదు. కానీ ప్రజలు చివరికి ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. అది మనందరి DNAలో ఆ బిట్ ఉంది. అది ఎవరు, ఎప్పుడు ఎలా మారిపోతారు అనేది తెలియనివ్వదు’’ అని రాసుకొచ్చాడు. అసలు ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించే పెట్టాడనేది తెలియనప్పటికీ ఈ పోస్ట్ గురించి పలు చర్చలు జరుగుతున్నాయి. ఆయనను మలైకా కాకుండా ఎవరైనా మోసం చేసి ఉంటారు.. లేదా ఆమె గురించే ఇలాంటి పోస్ట్ పెట్టారు కావచ్చు అని అంటున్నారు.

Next Story