OG: ఓజీ రిలీజ్‌కు ముందే క్రేజ్ పెంచేసుకున్న విలన్.. ఏకంగా బాలీవుడ్‌లో ఆఫర్

by Chukka Sudharani |

ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డాన్ 3’.

OG: ఓజీ రిలీజ్‌కు ముందే క్రేజ్ పెంచేసుకున్న విలన్.. ఏకంగా బాలీవుడ్‌లో ఆఫర్
X

దిశ, సినిమా: ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డాన్ 3’. ఇందులో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా.. విలన్ పాత్రలో కోలీవుడ్ క్రేజీ నటుడు అర్జున్ దాస్‌ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. కోలీవుడ్‌లో ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న అర్జున్ దాస్.. ఓజీ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. రీసెంట్‌గా ఓజీ ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో అర్జున్ దాస్ పాత్ర హైలెట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. రణవీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డాన్ 3’లో విలన్‌గా అర్జున్ దాస్‌ను ఓకే చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాలో అర్జున్ కోసం ఓ స్పెషల్ పాత్రను రూపొందించాడట ఫర్హాన్. ఈ పాత్రతో అర్జున్ ఇమేజ్ మరింత పెరుగుతుందని అంచన వేస్తున్నారు నెటిజన్లు. అయితే.. ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇదే కన్ఫర్మ్ అయితే అర్జున్ దాస్ బాలీవుడ్ ఎంట్రీకి ‘డాన్ 3’ పెద్ద పీట వేసినట్లే అని సంబర పడుతున్నారు ఫ్యాన్స్. లింక్

Next Story