- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Archana: అప్పుడు మెచ్యూరిటీ లేక ఆ నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు బాధపడుతున్నాను
మగధీర సినిమాలో సలోని చేసిన పాత్రను రిజెక్ట్ చేసినందుకు ఇప్పుడు బాధగా ఉందని అర్చన వేద వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి అర్చన వేద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల కాలంలో సినిమాలకు కొంత దూరంగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన, తన కెరీర్‌లో తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఇప్పుడు బాధగా ఉందని వెల్లడించారు. అర్చన మాట్లాడుతూ… నేను రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమాలో ఓ పాటలో నటించాను. ఆ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత లీడ్ రోల్స్ అవకాశాలు రాలేదు. అదే సమయంలో ‘మగధీర’ సినిమాలో శ్రీహరి గారి ప్రేయసి పాత్ర (సలోని చేసిన పాత్ర) కోసం నన్ను సంప్రదించారు.
కానీ చిన్న పాత్రలు చేస్తే హీరోయిన్ అవకాశాలు రావు అనే భావనతో నేను ఆ పాత్రను రిజెక్ట్ చేశాను. అది నేను చేసిన తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ తర్వాత అదే పాత్ర చేసిన సలోనిని రాజమౌళి గారు ‘మర్యాద రామన్న’ సినిమాలో హీరోయిన్‌గా కూడా ఎంపిక చేశారు. ఆ సమయంలో ఆ పాత్ర చేసి ఉంటే నాకు కూడా అదే స్థాయి అవకాశం వచ్చేదేమో అని ఇప్పుడు బాధగా అనిపిస్తోంది. అప్పట్లో నాకు అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పాత్రను వదులుకున్నందుకు నిజంగా బాధపడుతున్నాను” అని చెప్పుకొచ్చారు.






