- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎంను కదా.. సినిమా రిలీజ్ ఈజీ అనుకున్నా కానీ.. : వీరమల్లు సక్సెస్‌మీట్‌లో పవన్
జీవితంలో తనకు ఏదీ అంత తేలికగా దొరకలేదని పేర్కొన్నారు నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan).

దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో తనకు ఏదీ అంత తేలికగా దొరకలేదని పేర్కొన్నారు నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan). ఆయన హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu Talk) చిత్రం నేడు విడుదల అవ్వగా.. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులతో దండయాత్ర చేశారు. తాజాగా హైదరాబాద్ లో సినిమా సక్సెస్ మీట్ (HHVM Success Meet) నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తన సినీ జీవితంలో తొలిసారి సక్సెస్ మీట్ కు హాజరైనట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంను కదా సినిమా చాలా ఈజీగా రిలీజ్ అవుతుందని అనుకున్నానని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న తానే పంచాయితీలు చేసి సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చిందన్నారు. గడిచిన వారంరోజులుగా రిలీజ్ పనుల కారణంగా నిద్రపోలేదని పేర్కొన్నారు.
ఇక సినిమా క్లైమాక్స్ అందరికీ నచ్చడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని, పార్ట్ -2 షూటింగ్ త్వరగా పూర్తవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హరిహర వీరమల్లు పార్ట్ -2 షూటింగ్ ఇప్పటికే 30 శాతం వరకు కంప్లీట్ అయిందని తెలిపారు. కొందరు హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కాట్ చేయాలని చూశారని, తన సినిమా వాళ్లను అంత భయపెట్టిందా అని పవన్ తన రాజకీయ శత్రువుల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా పై మిక్స్డ్ టాక్ వచ్చింది. కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రీమియర్స్ నుంచి అన్ని షో లు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తో కలిపి తొలిరోజు కలెక్షన్లు రూ.50 కోట్లు దాటవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.






