Anushka: రిలీజ్‌కు సిద్ధమైన ‘ఘాటి’.. సినిమా నుంచి అనుష్క మరో పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’.

Anushka: రిలీజ్‌కు సిద్ధమైన ‘ఘాటి’.. సినిమా నుంచి అనుష్క మరో పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. ఇందులో అనుష్క వైల్డ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాలు ఉన్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, భాషల్లో జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది.

దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. అనుష్క లుక్‌కు సంబంధించి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూను ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త పోస్టర్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో అనుష్క రెడ్ కలర్ శారీ కట్టుకుని అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తూనే.. చేతిలో కొడవలి పట్టుకుని వైల్డ్ లుక్‌లో చూస్తూ భయపెడుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. లింక్

Next Story