- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anushka Shetty: ఘాటీ ఎఫెక్ట్.. కొంతకాలం దూరంగా ఉందాం అనుకుంటున్నా అంటూ అనుష్క శెట్టి ఎమోషనల్ పోస్ట్
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘ఘాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.

దిశ, సినిమా: లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘ఘాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ‘బాహుబలి’, ‘భాగమతి’ వంటి సినిమాల్లో కత్తిపట్టి యాక్షన్ సీన్స్‌లో దుమ్మరెపీన అనుష్క.. ఇప్పుడు అదే తరహాలో ఘాటీ చిత్రం చేయడంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్‌కు మాత్రమే పరిమితం అయింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజైన వారం తర్వాత అనుష్క తాజాగా.. తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నీలి వెలుగును దీపకాంతిగా మార్చుకుంటూ.. సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి.. ప్రపంచంతో మళ్లీ కలిసిపోవడానికి కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నాను. త్వరలో మరన్ని కథలతో, మరింత ప్రేమతో మళ్లీ మిమ్మల్ని కలిసేందుకు మీ ముందుకు వస్తాను.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రమేతో మీ అనుష్క శెట్టి’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.






