- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) రాకింగ్ స్టార్ యష్(Yash) సరసన ‘కేజీఎఫ్’(KGF) మూవీలో నటించి మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) రాకింగ్ స్టార్ యష్(Yash) సరసన ‘కేజీఎఫ్’(KGF) మూవీలో నటించి మెప్పించింది. తన ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) సరసన ‘ఆదర్శ కుటుంబం’(Aadarsa Kutumbam) మూవీలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో కూడా నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. డైలీ ఏదో ఒక పోస్టుతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధిను యాంకర్ అనుష్క శెట్టి మీకేమైనా రిలేటివ్స్ ఆ అని అడుగుతాడు. ఎందుకుంటే ఈ ఇద్దరికీ పేరు చివర శెట్టి అని వస్తుంది కదా అందుకోసం. అప్పుడు
ఆమె స్పందిస్తూ.. ‘లేదు.. కానీ నాకు ఒక నమ్మకం ఉంది. రెడ్డీస్ అందరూ ఎక్కడో ఒకచోట రిలేటివ్స్ అయి ఉంటారు. అలాగే మేము కూడా ఎక్కడో ఒకచోట బంధువుల అయి ఉండవచ్చు అని.. కానీ ప్రజెంట్ మేము బంధువులు కాము. కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు నేను తనని కలవలేదు. బట్ ఆమె గురించి చాలా విన్నాను. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుందని, హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని, కైండ్ హార్ట్ అని.. సో ఆమెను మీట్ అవ్వాలని నాకు చాలా కోరికగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






