పుష్ప 3పై బిగ్ అప్డేట్..ఆ క్రికెట‌ర్ భార్య‌కు ఛాన్స్ ?

by velandi.Saikiran |

అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనుష్క శర్మ నటిస్తుందని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు పుష్ప 3 అంటున్నారు.

పుష్ప 3పై బిగ్ అప్డేట్..ఆ క్రికెట‌ర్ భార్య‌కు ఛాన్స్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప, పుష్ప 2 రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇక త్వరలోనే పుష్ప 3 కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ సన్నద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా ఓ ప్రత్యేక ఆఫీస్ ను తీసుకొని ప్రాజెక్టు పైన వర్క్ చేస్తున్నారట సుకుమార్. అయితే ఈ నేపథ్యంలో పుష్ప 3 సినిమాలో అనుష్క శర్మ నటిస్తారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

తన భర్తతో కలిసి లండన్ లోనే ఉంటున్న అనుష్క శర్మ, 8 సంవత్సరాల తర్వాత మళ్లీ స్క్రీన్ పైన కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు నడుస్తోంది. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనుష్క శర్మ నటిస్తుందని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు పుష్ప 3 అంటున్నారు. ఇందులో అనుష్క శర్మకు స్పెషల్ రోల్ ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా పుష్ప 3 సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా పుష్ప ప్రాజెక్టులో హీరోగా అల్లు అర్జున్ నటించగా, హీరోయిన్ గా రష్మిక మెరిశారు. ఈ ప్రాజెక్టులో యాంకర్ అనసూయ, సునీల్, సందడి చేయగా మొదటి సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది. రెండో పార్ట్ లో శ్రీ లీల స్టెప్పులు ఇరగదీసింది.

Next Story